2024 లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) చీఫ్ మల్లికార్జున ఖర్గే 16 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కన్వీనర్‌గా టీఎస్ సింగ్ డియోను నియమించారు. సభ్యులుగా సిద్ధరామయ్య, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, శశిథరూర్, ఆనంద్ శర్మ, ప్రవీణ్ చక్రవర్తి, రంజిత్ రంజన్ తదితరులున్నారు.