వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉత్తర ద్వారామే ఎందుకంటే.. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీ మహావిష్ణువు.
విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి విష్ణు దర్శనం చేయడమంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం.