దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. నిర్మాణ పనులపై నిషేధం, వాహనాలపై ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉండటంతో వాటిని కఠినంగా అమలు చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ అంతటా AQI క్రమంగా పెరుగుతూ వస్తోంది.
సాయంత్రం వరకు AQI 405 పాయింట్లకు చేరింది. దీనికి తోడు చలికాలం కావడంతో శనివారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రాబోయే 24 గంటల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.