భగవంతుని సేవతో పాటుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు మంత్రి రోజా చెప్పారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె తిరుమలలోని శ్రీవారిని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆమెకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.