యూపీలోని ఓ కాలేజీలో పిల్లలకు సరిగా చదువు చెప్పడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో మాట్లాడేందుకు పిలిచి తన క్యాబిన్‌లో స్కూల్ యజమాని కులం పేరుతో దూషించాడని విద్యార్థి తండ్రి ఆరోపించాడు.
పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు అట్రాసిటీ యాక్ట్ వర్తించదని తాజాగా అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ తీర్పు వెలువరించింది. బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించడం అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నేరం అవుతుందన్నారు.