విజయనగరం జిల్లా, రేగిడి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెం బూరు వాసుదేవరావు ఉరఫ్ సత్యనారాయణ(37) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఇనుప నిచ్చెన వేసి గడ్డి కుప్ప పెడుతుండగా వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగి లాయి. దీంతో విద్యుదాఘాతానికి గురికావడంతో 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే పరీక్షించగా వాసుదేవరావు మృతిచెందినట్లు నిర్ధారించారు. వాసుదేవరావుకు భార్య స్వప్న, కుమార్తె జోష్ణవి ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.