నెల్లూరు జిల్లా కోవూరులో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. జగనన్న అండతో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత పొందిన తీరును నేతలు సభలో వివరించగా, జనం కరతాళధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు.