వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న జగనన్న. ప్రతి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 2019కి ముందు పింఛన్ కావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడి గుమ్మం వద్దకు వెళ్లి అడగాల్సిన పరిస్థితి. 2019 తర్వాత నేరుగా వాలంటీర్‌ను ఇంటికి పంపి నేనున్నానని చెప్పి.. తలెత్తుకొని పథకాలు అందుకొనేలా చేసిన జగనన్న. వాలంటీర్లని పీకేస్తామని, మా నాయకుల చుట్టూ తిరగాల్సిందేనని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి వారు రకరకాల మాటలు చెబుతారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ జిల్లాలో బీసీనైన నన్ను మంత్రిగా చేసిన ఘనత జగనన్నదే. 2024లో జగనన్నను మన భుజస్కందాలపై మోసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. పవన్, చంద్రబాబు ఒకే లక్ష్యంతో వస్తున్నారు. మీ దీవెనలు ఉన్నంత వరకు వీళ్లు జగనన్న వెంట్రుక కూడా పీకలేరు. మా జిల్లాలో ముగ్గురు పనికి రారని జగనన్న తీసేస్తే వారిని చేర్చుకున్న దిక్కులేని పార్టీ టీడీపీ అని అన్నారు.