అంగన్‌వాడీ సంఘాల 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఆమోదించామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్‌వాడీ సంఘాలతో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రాట్యూటీ అంశం తమ పరిధిలో లేదని అంగన్‌వాడీలకు చెప్పామన్నారు. వేతనం పెంపుపై కొంత సమయం అడిగామని, సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలని, ఇందుకు సహకరించాలని అంగన్‌వాడీలను కోరామన్నారు. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరామన్నారు. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతామని మంత్రి బొత్స వివరించారు. అంగన్‌వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని, అంగన్‌వాడీలను బెదిరించడం లేదని, రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు.