ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజ పారదర్శకంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. స్థానిక రామభద్రపురం జెడ్పీ హైస్కూల్ లో ఆమె మాట్లాడుతూ ఇంతవరకు 1లక్ష 750 టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. మిల్లర్ల ద్వారా సుమారు 105 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ గారెంటీ వచ్చిందన్నారు.అక్రమ వసూళ్లుకు పాల్పడిన వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.