సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26, 2023 నాటికి 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకును లోడ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీనిని సాధించడానికి కేవలం 270 రోజులు మాత్రమే తీసుకుంది. కాగా సరుకు రవాణాకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 284 రోజుల్లో ఇదే రికార్డును, 2021-22 సంవత్సరంలో 317 రోజుల్లో సాధించింది.