ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 3న కాకినాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పబ్లిక్‌హెల్త్, మెప్మా, డీఆర్‌డీఏ, పౌర సరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్, ప్రజారవాణా, సమాచార పౌర సంబంధాలు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.