‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామన్నారు. పాదయాత్ర, ఎన్నికల సమయంలో, వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు 730 అని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం 109 మాత్రమేనని.. 85 శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచించడమేనా జగన్ రెడ్డి నీతి.. నిజాయితీ? అంటూ ప్రశ్నించారు.