మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లా అసోధ్ గ్రామంలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన 20 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ఆమెను అనుప కోల్గా గుర్తించారు. అనుప కొన్నాళ్లుగా రజనీష్తో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ పేరుతో తీసుకెళ్లి తన స్నేహితుడైన డా.సుగ్రీవ శ్రీవాస్తవతో కలిసి ఆమెను చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.