కోరం లేక కదిరి మున్సిపల్ సమావేశం వాయిదా పడింది. శనివారం ఉదయం కదిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు.