ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం మధ్యాహ్నం తాడిమర్రి మండలం దాడి తోట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుతూ 2024లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాడిమర్రి మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ముఖ్యంగా రైతులకు మరిన్ని సేవల్ని ముంగిట్లకే తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.