ధర్మవరం మున్సిపల్ ఔట్సోర్సింగ్ & ఇంజనీరింగ్ కార్మికులు వరుసగా ఐదవ రోజు విధులకు హాజరుకాకుండా నిరవధిక సమ్మెను కొనసాగించారు. శనివారం కార్మికులందరూ నల్ల బట్టలు ధరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న నిరసన శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.