ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 05:00 PM

ఎన్నికల హామీలు అమలుతో పాటు సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మునిసిపల్‌ కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరవధిక సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన దీక్షా శిబిరాలను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, టీడీపీ నేతలు సందర్శించి.. వారికి మద్దతు తెలిపారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నా.. ప్రభుత్వం సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com