శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం వద్ద మునిసిపల్ కార్మికులు ధర్నా చేశారు. సమస్యల పరిష్కారంలో చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుగుల గణేష్, ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆప్కాస్ కార్మికులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, క్లాప్ డ్రైవర్లకు 18,600 జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణ రాజు, అర్జిరాము, ఏ.రాజేష్, టి.వెంకటలక్ష్మి, టి.మల్లమ్మ, జె.మాధవి, ఏ.మోహన్, డి.యుగంధర్, ఎం.నారాయణరావు, డి.సురేష్‌కుమార్, ఎం.అప్పన్న పాల్గొన్నారు.