జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడ పర్యటన మరింత చర్చనీయాంశంగా మారింది. మూడు రోజలపాటు కాకినాడలో మకాం వేయడానికి వచ్చిన పవన్ ఈ రెండు రోజుల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించడంపై పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది. పవన్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీచేసే ఉద్దేశంతో సిటీ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టిసారించారా? అనే కోణంలో నేతలు చర్చించుకుంటున్నారు. తొలిరోజు గురువారం మధ్యాహ్నం నుంచి కాకినాడ సిటీ నియోజకవర్గం నేతలతో సమీక్షించిన పవన్ పార్టీకి సంబంధించి వార్డు స్థాయి కమిటీలు వేయకపోవడంపై నియోజకవర్గ ఇన్‌చార్జి, సిటీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరిగి శుక్రవారం కూడా రోజంతా ఈ నియోజక వర్గంపైనే ఫోకస్ పెట్టి ఇరవై వార్డులకు చెందిన కార్యకర్తలను పిలిపించుకుని రోజంతా సమీక్షిం చారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించడానికి గల కారణాలపై నేతలు ఆరా తీసి పవన్ ఇక్కడి నుంచి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారేమో అని చర్చించుకుంటు న్నారు. మరోపక్క మధ్యలో కాకినాడకు చెందిన పలువురు మేధావులతో ముఖాముఖీ మాట్లాడిన పవన్ కాకినాడలో వైసీపీ దందాల గురించి ఆరాతీశారు. వారు చెప్పినవన్నీ విని ఇక్కడ శాంతి భద్ర తల సమస్య లు ఉన్నాయని, ఏకంగా ఆస్తులు కూడా రాయించేసుకుంటున్నారని పవన్ వారితో పేర్కొనడం విశేషం. ఇక్కడ అక్రమాలపై పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి వివరించాలని పవన్ ఆదేశించారు. వైసీపీ పాలనలో ఏవర్గానికీ న్యాయం జరగలేదని, అందరిని జగన్ మోసం చేశారని పవన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాయే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీ పీకి ఒక్క సీటు కూడా రాకూడదని పేర్కొన్నారు. ఆ దిశగా పనిచేయాలని సూచించారు. సిటీ లో ఏ సమ స్య ఉన్నా తనతో నేరుగా సంప్రదించి మాట్లాడొచ్చని క్యాడర్‌కు సూచించారు. కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేసి ప్రతి వార్డులోను జనసేన జెండా ఎగిరేలా పనిచేయాలన్నారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించా రు. జనం సమస్యలను మన సమస్యలుగా భావించి పోరాడాలని దిశానిర్దేశం చేశారు. కాగా టీడీపీతో పొత్తుపైనా నేతలకు పవన్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని పడ గొట్టాలంటే మన పోరాటం ఒక్కటే సరిపోదని, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు. కాకినాడసిటీలో టీడీపీ నేతలు, క్యాడర్‌తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని హితబోధ చేశారు. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బిందాస్‌గా బయట తిరుగుతున్నాడని, ఇంక ఎస్సీలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. మరోపక్క మూడో రోజు శనివారం కూడా కాకినాడ సిటీపైనే పవన్ సమీక్షించను న్నారు. నియోజకవర్గంలో ఎన్నికల సమయం నాటికి మరింత బలోపేతం కావడా నికి సూచ నలు, కార్యాచరణ పవన్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమయం మిగిలి ఉంటే కాకి నాడ రూరల్‌పైనా సమీక్షించనున్నారు. ఆ తర్వాత శనివారం రాత్రికి అమరావతికి పయనమ య్యే అవకాశం ఉందని పార్టీ నేతలు వివరించారు. మళ్లీ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల సమీక్ష కోసం ఇక్కడకు రానున్నారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులతో శనివారం పవన్‌కల్యాణ్ భేటీ కానున్నారు.