మున్సిపల్ కార్మి కులు సమాజానికి గొప్ప సేవలందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని సీపీఎం నేత మధు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తమ ఉద్యో గాలను పర్మినెంట్ చేయాలని, రూ.26 వేల కనీస వేత నం చెల్లించాలని మున్సిపల్ కార్మికులు స్థానిక ధర్నా చౌక్‌లో చేపట్టిన ధర్నా నాలుగో రోజు శుక్రవారమూ కొనసాగింది. దీక్షా శిబిరాన్ని మధు, చలసాని శ్రీనివాస్ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చేతనైతే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని హితవుపలికారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నా రని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపి వారి కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాలనే ఐక్యం చేసి రాష్ట్రబంద్‌కు వెనుకాడ బోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలువురు సీఐటీయూ నేతలు అధిక సంఖ్యలో వివిధ విభాగాల మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.