రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో టీడీపీ నేత గంటా నరహరి ఆధ్వర్యంలో ఎల్ఐసీ కార్యాలయం పక్కన జనవరి 1న అన్న క్యాంటీన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 4వేల మంది జనసమీకరణ లక్ష్యంగా నియోజకవర్గం లోని ఆరు మండలాలనుంచి టీడీపీ కార్యకర్తలు, నేతలను ఆహ్వానిస్తున్నారు. జనవరి 1న పేదలందరికీ చికెన బిర్యానీ, భోజనం వడ్డించనున్నారు. ఇందుకు సంబంఽధించిన ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులతో ఈ అన్న క్యాంటీనను ప్రారంభిస్తున్నామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో ఈ అన్న క్యాంటీనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్యనాయుడు, టీడీపీ నాయకులు జిల్లా కార్యదర్శి నాగమునిరెడ్డి, ఆర్యవైశ్య నాయకుడు సునీల్ పాల్గొన్నారు.