ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో సమ్మె విరమించాలని మునిసిపల్ కార్మికులకు అధికారులు తెలిపారు. ‘విధులకు హాజరు కండి. మీకు పోలీసులతో రక్షణ కల్పిస్తాం. లేకపోతే విధుల నుండి తొలగిస్తామని’ మునిసిపల్ శానిటేషన్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో సీఐటీయూ నాయకులతో కలసి అధికారులను మునిసిపల్ కార్మికులు అడ్డుకున్నారు. కాగా డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు శనివారం కదం తొక్కారు. ఎన్నికల ముందు లేనిపోని హామీలను ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని ఎద్దేవ చేశారు. అనంతరం మెడికల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు.