ముంబయిలో మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు ఓ రేవ్ పార్టీ పై దాడి చేశారు. ఈ మేరకు థానేలో 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు థానే క్రైమ్ బ్రాంచ్ యూనిట్ లేట్ నైట్ ఆపరేషన్ ను చేపట్టింది. థానేలోని కాసర్‌వాడవ్లీ క్రీక్‌సైడ్‌లో రేవ్ పార్టీని ఛేదించినట్టు మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు.