వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ ముఖ్య నేతలతో లోటస్‌పాండ్ కార్యాలయంలో భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పిన విషయంపై షర్మిలను ప్రశ్నించగా ఆమె ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు.