వాటాదారులకు డివిడెండ్ పంపిణీ విషయంలో బ్యాంక్‌లకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. నికర నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) 6 శాతం కంటే తక్కువగా ఉంటే, అవి డివిడెండ్ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొంది.
ఒక ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ పంపిణీ చేసుకోవాలంటే నికర ఎన్‌పీఏలు 6 శాతంలోపు ఉండాలని ముసాయిదా ప్రతిపాదనల్లో ఆర్‌బీఐ పేర్కొంది.