రానున్నది ఎన్నికల కాలం. అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. దొంగ హామీలతో చంద్రబాబు అండ్ కో ఇటుగా వస్తారు. వారు ఇచ్చే అబద్ధపు హామీలను నమ్మవద్దు అని పార్టీ శ్రేణులకు హితవు పలికారు. వాటిని తిప్పికొట్టి, మేలైన పాలన మనం ఏ విధంగా అందించాం అన్నది ప్రజలకు చెప్పగలగాలి. వాటిపై మీ అందరూ మాట్లాడగలగాలి. సంబంధిత అవగాహన వారిలో కల్పించగలగాలి. బాధ్యతాయుతం అయిన రాజకీయ కార్యకర్తలు చేయాల్సిన పని ఇది. ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నిత్యావసరాలు ధరలు పెరిగాయి అంటున్నారే..అది నిజం కాదు. ఏ రాష్ట్రంలో అయినా మన కన్నా తక్కువకు నిత్యావసరాలు దొరుకుతున్నాయో చెప్పమని సంబంధిత విపక్ష నాయకులను నిలదీయండి. అలానే ప్రజలకు మనం ఏం చేశామో వివరిస్తూ వెళ్లండి. జీఎల్ ఫంక్షన్ హాల్ లో చింతాడ,తండేంవలస,శిలగాం-సింగువలస, అలికాం,పొన్నాం, నవనంబాడు, గేదెలవానిపేట, భైరివానిపేట, నైర, బట్టేరు, లంకాం, గూడెం పంచాయతీలకు చెందిన పార్టీ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు.