ఓటు హక్కు నమోదు, ఓటరు చైతన్యం పై శుక్రవారం ఉదయం రాయచోటి శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఈనాడు - ఈటివి ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన యువత, విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్నారు.