ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి, రాయవరంలో ఆయన మాట్లాడుతూ..... టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన అనేక సంక్షేమ పథకాలు రద్దుచేయడంతో పాటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ పర్యటించిన ఎమ్మెల్యే చంద్రబాబు ప్రకటించిన 6పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు ఉండవిల్లి రాంబాబు, కోడి చిన్నఅప్పారావు, దేవు వెంకట్రాజు, నేతల సురేష్, నూలు వీరవెంకట సత్యనారాయణ, చల్లా సత్యనారాయణ, కందుకూరి గంగరాజు, వెలుగుబంట్ల గోపీకృష్ణ,మచ్చా సూర్యారావు, వల్లూరి శ్రీనివాసచౌదరి, మలిపూడి సత్యనారాయణ(చిన్న), వైఆర్కే పరమహంస, మేడపాటి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.