ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదని ఏఐటీయూసీ అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హెచ్చరించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవ రాయల సర్కిల్‌లో అంగన్‌వాడీల సమ్మె గురువారం 24వ రోజుకు చేరిం ది. ఈ సందర్బంగా ఈ నెల 5వ తేదీన అంగన్‌వాడీలు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను అంగన్‌వాడీ ఉద్యోగులు యూ నియన్ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మునెప్ప, చంద్రశేఖర్, సాయిబాబా, సుధాకరప్ప, మహ్మద్ రఫీ, రేణుకమ్మ పాల్గొన్నారు.
![]() |
![]() |