రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే పశ్చిమప్రాంత వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడనుందన్నారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మొదటి ఏడాదిలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, టీడీపీ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, పట్టణశాఖ అధ్యక్షులు సయ్యద్ షాన్షావలి, రాచర్లశాఖ అధ్యక్షులు యోగానంద్, టీడీపీ నాయకులు భూపాల్‌రెడ్డి, జీవనేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
![]() |
![]() |