ఎన్నికల సమయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయమై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ ప్రకారం దశల వారిగా ఈ నాలుగున్నరేళ్లలో పెంచుతూ పెంచుతూ ఇవాళ ఈ జనవరి ఒకటి నుంచి నూతన సంవత్సర కానుకగా..మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం,సింగుపురం గ్రామంలో వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానికులతో, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకం అయి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.