ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.