వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.... సామాజిక సాధికారత, సామాజిక న్యాయమంటే అసలు సిసలు అర్థం చెప్పిన నాయకుడు జగనన్న.గతంలో ఎస్సీ,ఎస్టీలు కులవివక్షతో ఎంత హీనంగా బతికారో, ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. మన పిల్లలు చదువుకోలేని పరిస్థితులు ఆరోజుల్లో ఉండేవి. జగనన్న ఈ కులవివక్షపై దాడే చేశారు. తన పాలనలో బడుగు,బలహీనవర్గాలకు పెద్దపీట వేశారు. సామాజికంగా,రాజకీయంగా,ఆర్థికంగా వారి స్థాయిని పెంచారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. మహిళలు అనుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి. మహిళలు అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. స్త్రీశక్తి అపారమైంది. ఆ స్త్రీశక్తే ఈరోజు జగనన్నకు అండగా నిలబడాలి. ఆయన పథకాలను గుర్తుచేసుకోవాలి. పథకాల వల్ల మారిన మన జీవనస్థాయిలను గుర్తుంచుకోవాలి. మళ్లీ జగనన్న వస్తే ..మన జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయి. జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల విలువ తెలిసిన నాయకుడు జగనన్న. జగనన్న మనకు అండగా ఉన్నాడు. మనం ఆయనకు అండగా ఉండాలి అని అన్నారు.