సీఎం జగన్ ఇస్తున్న సంక్షేమ పధకాలు పొందుతున్న వారిలో భాగంగా నేను కాపు నేస్తం 3 విడతలు తీసుకున్నా, నాలుగో విడత రాలేదు, కరెంట్ బిల్లు సమస్య వల్ల రాలేదన్నారు, వలంటీర్ వచ్చి సచివాలయంలో అన్నీ సరిచేసి మళ్ళీ వచ్చిందని చెప్పారు, నాకు సంక్రాంతి పండుగ ముందుగా వచ్చినంత ఆనందం ఉంది, కాపు నేస్తం పథకం మమ్మల్ని ఆదుకుంది, కాపులను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా మీరు గుర్తుపెట్టుకుని మాకు సాయం చేశారు, మేం ధన్యులం, కాపునేస్తం డబ్బుతో నేను కుట్టుమిషన్ కొనుక్కుని జీవనం సాగిస్తున్నాను, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భర్త వికలాంగుడు, నా భర్తకు వికలాంగ ఫించన్ ఇస్తున్నారు, నాకు కొడుకులు లేరు, నా కొడుకే పెన్షన్ ఇస్తున్నాడా అని ఆనందపడుతున్నాం, నాకు అన్ని ప్రభుత్వ పథకాలు అందాయి, నా భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఎటాక్ వస్తే చాలా కంగారుపడ్డాం, ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయల ఉచిత వైద్యం అందించారు, మీరు చాలా సాయం చేశారన్నా, మాలాంటి అనేకమంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఈ ఐదేళ్ళలో నేను రూ. 3.50 లక్షలు మీ ద్వారా లబ్ధిపొందాను, మా కాపు అక్కచెల్లెమ్మలు అంతా మీ వెంటే ఉంటారు, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, ధ్యాంక్యూ అన్నా అని రాజమండ్రి రూరల్, హుకుంపేట, శాంతి శ్రీ అనే లబ్ధిదారు తెలిపారు .