ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ..ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు.