వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది.. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నానని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2024 ఎన్నికల్లో సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీటు కోసం తాను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను.. నేను సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారు.. ఇక్కడ తప్పించినా పార్టీ సరైన గౌరవం ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.