జనసేన కేంద్ర కార్యాలయంలో న్యాయవాదులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పవన్ కళ్యాణ్ కు న్యాయవాదులు వివరించారు."వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఏమిటో అర్దం కాలేదు. వారసత్వంగా వచ్చిన భూమిలో జగన్ ముఖచిత్రంతో రాయి ఏమిటి. నేను ఇచ్చేవాడిని.. మీరు తీసుకునేవాడిని.. అందరూ లోబడి ఉండాలనే మైండ్ సెట్ జగన్ ది. రాజ్యాంగ బద్దంగా ఆలోచన చేసే వారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. భూహక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ముందుగానే అందులోని అంశాలను అమలు చేసేస్తున్నారు. ఎవరి ఆస్తులు అయినా.. వారి కబంధ హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు. నేను ఈ విషయం విన్నప్పుడు న్యాయవాదులు తమ కేసులు పోతాయనే ఆందోళనలు చేస్తున్నారని ప్రచారం చేశారు. గతంలో ఇసుక సమస్య సమయంలో కూడా కార్మికుల పొట్ట కొట్టి వారిపైనే దుష్ప్రచారం చేశారు. లీగల్ జీనియస్ నాని పాల్కీ వాలాకు నేను ఏకలవ్య శిష్యుడిని. న్యాయవ్యవస్థను అతిక్రమించి రెవిన్యూకు హక్కును ఎలా కట్టబెడతారు. ఆస్తులను దోచేయడం సులభతరం అవుతుందనే ఈ చట్టం తెచ్చారు. " అని పవన్ కల్యాణ్ విమర్శించారు.