మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. కొడాలి నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్‌సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధన నిర్వహించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తర్వాత కొడాలని నాని, వైఎస్సార్‌సీపీ నేతలు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కొడాలి నానితో పాటూ వైఎస్సార్‌సీపీ నేతలకు ఊరట లభించింది.