ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సోమవారం టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామానికి చెందిన బెస్త సంఘం సభ్యులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 2024 ఎన్నికలలో అఖండ మెజారిటీతో టిడిపి ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా అశోక రెడ్డి అన్నారు.