వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ..... సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంఖుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.