అభివృద్ధికి నిదర్శనం..ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించి, సంబంధిత నిర్వాహకులకు శుభాకాంక్షలు అందించారు. పూసర్లపాడు లో రూ.21.80 కోట్లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభం, బందరువాని పేట - కళింగపట్నం, రూ.3.70 కోట్లతో బిటి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కె.మత్స్యలేశంలో రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం భవనం ప్రారంభించారు. కె.మత్స్యలేశంలో కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.26 కోట్లతో నిరమించిన అదనపు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజాన్ని మార్చేందుకు,సమాజంలో అంతరాలు తగ్గించేందుకు విద్య ఒకటే మార్గం. అందుకే విద్యకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చింది ఈ ప్రభుత్వం . ఇందుకు అనుగుణంగానే ప్రాధాన్య క్రమంలో విద్య వైద్య రంగాలకు ఎక్కువ నిధులను బడ్జెట్ లో కేటాయించి వెచ్చించాం. 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగం అయింది. అలానే ఇవాళ బడులకు, కళాశాలకు ఆధునిక వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి,అనంతర నిర్వహణలో తల్లిదండ్రులు, టీచర్స్ కమిటీనీ ఇందులో భాగస్వాములు చేశాము అని తెలిపారు.