వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ బీదమస్తాన్‌రావు మాట్లాడుతూ.... ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు జగనన్న ఎంతో సామాజిక న్యాయం చేశారు జగనన్న. రాజకీయాల్లో ఆయావర్గాలకు పెద్దపీట వేశారు జగనన్న. తన కేబినెట్‌లోని 25మంది మంత్రుల్లో 17మంది బడుగు,బలహీన వర్గాల వారే ఉండటం..జగనన్న వల్లే సాధ్యమైంది. రాజ్యసభలో సైతం ఐదుగురిని సభ్యులుగా కూర్చోబెట్టిన దార్శనికుడు జగనన్న. కులగణన కోసం కమిషన్ ఏర్పాటు చేశారు జగనన్న. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50శాతం బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వాటా కల్పించిన ముఖ్యమంత్రి జగనన్న. సంక్షేమపథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా, లంచాలకు చోటు లేకుండా, పార్టీలకతీతంగా, కులమతాల కతీతంగా అందించడమన్నది జగనన్న పాలనలోనే చూస్తున్నాం. సామాజిక సాధికారత కల్పించడంలో..సామాజిక న్యాయం చేయడంలో జగనన్నకు జగనన్నే సాటే. మహిళలకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. మత్స్యకారుల కోసం హార్బర్లు ఏర్పాటు చేస్తూ, వారి స్థితిగతులను మార్చాలని చిత్తశుద్దితో జగనన్న కృషి చేస్తున్నారు అని అన్నారు.