వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.... జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ బాగుండాలని కష్టపడుతున్నారు. ప్రజల్ని పూర్తిగా ఓటర్లుగానే చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రజల ఆరోగ్యం, చదువు, రైతన్నలకు నీరు అందాలని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టిన వ్యక్తి వైయస్సార్. ఆయన తర్వాత జగనన్న సీఎంగా వచ్చి పది అడుగులు ముందుకు వేశారు. పేదవాడిని గౌరవించారు. ప్రజలు చేయి చాచి అడగాల్సిన పని లేకుండా, ఆఫీసులు, నాయకుల చుట్టూ తిరగకుండా, హక్కుగా భావించి పథకాలు అందిస్తున్నారు. ఇది జగనన్న చేసి చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రాజకీయంగా పదవులిచ్చారు. వెనుకబడిన జాతులకు పదవులు, పరిపాలించేలా 50 శాతంపైగా అవకాశాలు ఇచ్చిన జగనన్న. 2019 కి ముందు ఎన్ని పథకాలున్నాయి? ఇప్పుడెన్ని పథకాలు అనేది ప్రజలు బేరీజు వేసుకోవాలి. ప్రజా ప్రభుత్వం, ప్రజల్ని గౌరవించే ప్రభుత్వం జగనన్నది అని అన్నారు.