వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.... చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఎక్కడా ఫెయిర్‌గా ఉన్న దాఖలాలు లేవు. జగనన్న పేద పిల్లల్ని చదివించాడు. రైతుల్ని, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతల్ని ఆదుకున్నాడు. ఇళ్లు కట్టించాడు. అసైన్డ్ భూములపై ఇబ్బందులను తొలగించాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే జగనన్న గొప్పతనమే. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చారు. అధికారం కోసం ఎన్ని రకాలుగానైనా ఎస్సీలను, బీసీలను అందరినీ చంద్రబాబు వాడుకుంటాడు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటాడా అంటాడు. బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు. ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ చంద్రబాబుకు మనం నచ్చం. దళితులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అవమానపర్చి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. పవన్ లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. జగనన్నను చేజార్చుకుంటే మన భవిష్యత్ 20-25 సంవత్సరాలు వెనక్కి పోతుంది. జగనన్నను కాపాడుకుంటే మన భావితరాలు బాగుంటాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీని రేవంత్ రెడ్డి రూ.10 లక్షలు చేస్తే ఆహా ఓహో అంటున్న ఎల్లో మీడియా... జగనన్న ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచితే నోరెత్తలేదు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కుప్పానికి నీళ్లు ఇవ్వని బాబు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ వెళ్లి పడుకుంటున్న చంద్రబాబు. కానీ జగనన్న ఇక్కడే ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని చూస్తుంటే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అద్భుతమైన రాజధాని కడతానని 53 వేల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అమరావతి రైతులు ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబే. వ్యవసాయ కూలీ కొడుకునైన నన్ను ఎంపీగా చేసిన ఘనత జగనన్నది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. జన్మభూమి కమిటీల ద్వారా డబ్బు దోచుకున్న చంద్రబాబు. తెలంగాణలో 7 చోట్ల పవన్ కల్యాణ్ పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. వీళ్లంతా 151 సీట్లు, 30 మంది ఎంపీల బలం ఉన్న జగనన్నను ఎలా ఓడిస్తారు అని ప్రశ్నించారు.