బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై విపరీతంగా చూపిస్తోంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని గాలులు వీస్తున్నాయి.
గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు చలిమంటలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. బంగాళాఖాతంలో ఇవాళ గంటకు సుమారు 35 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.