ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

national |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 02:18 PM

మన దేశంలో పెళ్లిళ్లను కోట్లు ఖర్చు చేసి ఘనంగా జరుపుకుంటారు. కానీ, ఇద్దరు యువ ఐఏఎస్‌లు మాత్రం సాదాసీదా వివాహంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. 2023 బ్యాచ్‌కు చెందిన మాధవ్ భరద్వాజ్–అదితి వాష్ణ్యే రాజస్థాన్‌లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాంటి హంగామా లేకుండా దండలు మార్చుకుని పెళ్లి పూర్తి చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎస్డీఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa