ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం 122 ఏళ్ల తర్వాత తన గర్భగుడి (జగమోహన హాల్) తలుపులు తెరవడానికి సిద్ధమవుతోంది. భారత పురావస్తు శాఖ (ASI), ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా దశాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను శాస్త్రీయంగా తొలగించే ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ మరో మూడు నెలల్లో పూర్తవుతుందని అంచనా. విజయవంతమైతే, భక్తులు శతాబ్దం తర్వాత గర్భగుడిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఈ చర్య ఆలయానికి మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షును అందిస్తుందని ASI అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa