ఆంధ్రప్రదేశ్‌లో కలకలంరేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని హత్యచేసిన కులవర్ధన్ బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడు. మంగళవారం పారిపోయిన కులవర్ధన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో చెరువులో మృతదేహం దొరికింది. బాలిక హత్య తర్వాత జనాలు ఆగ్రహంతో ఉన్నారు, ఒకవేళ దొరికితే చంపేస్తారేమో, పోలీసుల భయమో కానీ అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడనిపోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది.
బాలికపై హత్యాచారం ఘటనలో పోలీస్ కేసు నమోదైంది. పోక్సోతో పాటుగా హత్య, ఇతర సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కులవర్ధన్ ఉండగా.. పోలీసులు ఏ-2గా అతడి తల్లి అంజనమ్మను చేర్చారు. కులవర్ధన్ తల్లిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఫిర్యాదు చేడయంతో కేసు నమోదైంది. అయితే అంజనమ్మ సోమవారం రాత్రి 7 గంటల వరకు ఇంట్లో ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అంజనమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కులవర్ధన్ మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసిన తర్వాత గుర్తించేందుకు తల్లి లేకపోవడంతో.. అతడి పెదన్నాన్న, పెద్దమ్మలను పిలిపించారు. వారిద్దరు చనిపోయింది కులవర్ధన్ అని నిర్ధారించారు. అయితే పోస్ట్‌మార్టమ్ తర్వాత అతడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్రియలు పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
చిన్నారి హత్యకేసుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికీలక విషయాలు వెల్లడించారు. కులవర్ధన్ ఇంట్లోని డ్రమ్ములో మంగళవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించామన్నారు. వెంటనే కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకోగా.. బయట వాహనం ఎక్కిస్తున్న సమయంలో స్థానికులు దాడి చేశారన్నారు. అతడిని రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా హైవేపై ప్రజలు బైఠాయించడంతో కులవర్ధన్‌ను తీసుకెళ్లే పరిస్థితి లేదన్నారు. అయితే రక్షక్ వాహనంలో సిబ్బంది ఆందోళన చేస్తున్న ప్రజల్ని అదుపు చేస్తున్న సమయంలో వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని.. అదే సమయంలో కులవర్ధన్ పారిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు కులవర్ధన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. కడప జిల్లా వీరబల్లి మండలంలో నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa