మెరిసే, అందమైన, ఒత్తైన జుట్టు కోసం పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి7 (బయోటిన్) చాలా అవసరం. గుడ్లు, బాదంపప్పు, చిలగడదుంపలు, పాలకూర, చేపలు, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడోలు, మటన్ లివర్, అరటిపండ్లు, పుట్టగొడుగులు వంటివి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు జుట్టు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కనుక బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డును ఉడికించి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంపప్పులో కూడా బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది జుట్టు మెరుస్తుంది. చిలగడదుంపలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో బయోటిన్ తో పాటు బీటాకెరోటీన్ సమృద్దిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల తలచర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఆహారంలో భాగంగా పాలకూరను తీసుకోవడం వల్ల అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. పాలకూరను తీసుకోవడం వల్ల బయోటిన్ తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్ చేపలను తీసుకోవడం వల్ల జుట్టు అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తల చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు జుట్టు మెరిసేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు గింజలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో బయోటిన్ తో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa